
తమవాళ్లు ఓడారంటూ.. కోచ్‌ల వినూత్న నిరసన
తమ రెజ్లర్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మంగోలియన్ కోచ్‌లు రింగ్‌లోనే దుస్తులు విప్పి తమ నిరసన వ్యక్తం చేశారు.
రెజ్లింగ్‌లో తమ క్రీడాకారులు ఎలాగైనా గెలుస్తారని అనుకున్నారు. తాము ఇచ్చిన కోచింగ్ అలాంటిదని వారు భావించారు. కానీ, చివరకు తమ రెజ్లర్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మంగోలియన్ కోచ్‌లు రింగ్‌లోనే దుస్తులు విప్పి తమ నిరసన వ్యక్తం చేశారు. గంజోరిగీన్ మందఖ్నారన్ అనే రెజ్లర్ ఓడినట్లుగా జడ్జిలు ప్రకటించారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అతడి ప్రత్యర్థికి పెనాల్టీ పాయింటు ఇవ్వడంతో పాయింట్ల తేడాతో మంగోలియా రెజ్లర్ ఓడిపోయాడు.
అప్పటికి తమవాడు గెలిచాడని భావిస్తున్న కోచ్‌లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత.. వాళ్లకు అసలు విషయం తెలిసింది. జడ్జీల నిర్ణయాన్ని సవాలు చేయాలని కోచ్‌లు భావించారు. కానీ, అలా చేయడానికి వీల్లేదని జడ్జీలు వాళ్లకు చెప్పారు. దాంతో ఒకరు షర్టు విప్పేయగా, మరొకరు షర్టు, ప్యాంటు రెండూ విప్పేసి రింగ్‌లోనే పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు.