
పతకం నంబర్ 25
రియోడీజనీరో: అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్ లో మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో, 4x100 ప్రీ స్టయిల్ రిలే విభాగాలలో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఈ విభాగంలో తనపై నెగ్గిన జపాన్ స్విమ్మర్ మసాటో సాకాయ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడిని రెండో స్థానానికి నెట్టి మైకేల్ ఫెల్ప్స్ స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్ లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలోనూ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకం సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి.