
ఫెల్ప్స్ కు 22వ ఒలింపిక్ గోల్డ్ మెడల్
అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకాల వేట కొనసాగుతోంది.
రియో డి జనీరో: అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకాల వేట కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్ లో వరుసగా నాలుగో పోటీలోనూ ఈ ‘ఫ్లయింగ్ ఫిష్’ అందరికంటే ముందు నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. 200 మీటర్ల మెడ్లీ విభాగంలో అతడు స్వర్ణ పతకం కైవసం చేసుకుని తనకు తిరుగులేదని మరోసారి చాటాడు. జపాన్ కు చెందిన కొసుకె హాంగినొ వెండి పతకం దక్కించుకున్నాడు. చైనా స్విమ్మర్ వాంగ్ షున్ రజతం సొంతం చేసుకున్నాడు.
22వ ఒలింపిక్ స్వర్ణాన్ని సొంతం చేసుకుని మైకేల్ ఫెల్ప్స్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా ఫెల్ప్స్‌కిది 26వ ఒలింపిక్ పతకం. ఇందులో 22 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి.