
సల్మాన్ కు సీనియర్ నటి మద్దతు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిండర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడాన్ని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సమర్థించారు. 'దబాంగ్' హీరోను ప్రజలు ఎంతో ఇష్టపడతారని, అతడిని బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. 'వ్యాట్ ఈజ్ ద ప్రాబ్లమ్' అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వెలుపల సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, సల్మాన్ ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్, రెజర్ల్ యోగేశ్వర్ దత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సల్మాన్ నియామకంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన లేదని, ఒలింపిక్ క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయనను అంబాసిడర్‌గా నియమించినట్టు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది.