
మిషన్ టోక్యో 2020 ప్రారంభించాలి
వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ చాంపియన్లు కరువవుతున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ చాంపియన్లు కరువవుతున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. 2020లో టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్కు మనం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, అందుకోసం మిషన్ టోక్యో 2020 ప్రారంభించాలని కోరారు. మన చాంపియన్లకు అత్యుత్తమ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.
అంతకు ముందు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధును ఆయన అభినందించారు. వందకోట్ల మంది ప్రజలు ఒక్క చాంపియన్ కోసం నిలబడటం చాలా అరుదుగా జరుగుతుందని, అలా ఇప్పుడు సింధు కోసం జరిగిందని చెప్పారు. ఆమెతో పాటు దేశాన్ని గర్వపడేలా చేసిన ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కూడా కేటీఆర్ అభినందించారు.
Country of billion craving for Olympic champs. Hon'ble PM @narendramodi ji, please start Mission Tokyo 2020 now & let's give our champs best
— KTR (@KTRTRS) 19 August 2016
How often do you have billion people rooting for one champ!! Kudos @Pvsindhu1 & her coach Gopichand for making a nation proud