
'ఈసారి షూటింగ్ బిగ్ ఫ్లాప్'
రియో డీ జనిరో: ఒలింపిక్స్ లో మనదేశ క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తికరంగా లేదని భారత్ తరపున 'షెఫ్-డీ-మిషన్'గా వ్యవహరించిన రాకేశ్ గుప్తా అన్నారు. మరిన్ని పతకాలు వస్తాయని అనుకున్నామని చెప్పారు. మూడు బంగారం, వెండి, కంచు పతకాలు వస్తాయని ఊహించినట్టు వెల్లడించారు. మన ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ పరిచారని వాపోయారు.
ఈసారి షూటింగ్ విభాగంలో దారుణంగా విఫలమయ్యారని, ఈ విభాగంలో మూడు బంగారు పతకాలు వస్తాయని ఆశించామని తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మనదేశానికి కేవలం రెండు పతకాలే దక్కాయి. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించగా, బ్యాడ్మింటన్ లో పీవీ సింధు వెండి పతకం కైవసం చేసుకుంది.