సల్మాన్‌ఖాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ తాజా సినిమా కోసం ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కుమార్ కూడా పని చేయనున్నాడు. ప్రముఖ రెజ్లర్ గామా పహిల్వాన్ జీవితం ఆధారంగా తీయబోయే సినిమా కాబట్టి కుస్తీపోటీల్లో సొహైల్‌కు శిక్షణ తప్పసరిగా మారింది. ఈ సినిమాను సల్లూభాయ్ స్వయంగా నిర్మిస్తుండగా, పునీత్ ఇస్సార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే సొహైల్ మూడునెలలపాటు రెజ్లింగ్‌లో సుశీల్ దగ్గర శిక్షణ తీసుకోనున్నాడు. సుశీల్ గురువు, అతని మామ సత్పాల్‌సింగ్ కూడా సొహైల్‌కు కొన్ని మెళకువలు నేర్పుతారు. ఈ సినిమా, పాత్ర కోసం సల్మాన్ తన తమ్ముడికి వ్యాయామం, ఆహారం గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు 99 కిలోల బరువుఉండేవాడు. ఆయన తగ్గట్టే సొహైల్ కూడా బరువు పెరుగుతున్నాడు.
ఇప్పటి వరకు 15 కేజీలు పెరిగాడు. మరింత పెరగాలని అన్న సూచించాడు. ‘ఈ పాత్ర కోసం సొహైల్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. శరీరంలో కొంచెం కూడా కొవ్వు లేకుండా తయారయ్యాడు. ఫొటోలు కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా షూటింగ్‌ను నవంబర్ నుంచి మొదలుపెడతాం. సుశీల్ దగ్గర శిక్షణ పూర్తయ్యాక, సొహైలే మాకు పోరాట సన్నివేశాల్లో సాయం కూడా చేస్తాడు. పహిల్వాన్ జీవితం, కవిత్వాన్ని అమితంగా అభిమానించడం, ప్రముఖ గాయకుడు బడే ఘులామ్ అలీఖాన్‌తో స్నేహం వంటి వాటిని ఈ సినిమాలో చూడవచ్చు’ అని పునీత్ వివరించాడు. సహాయ పాత్రల్లో కనిపించే రెజ్లర్ల కోసం పునీత్ దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించనున్నాడు. సల్మాన్ కూడా కొందరు అంతర్జాతీయ రెజ్లర్లతో మాట్లాడుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు ఐదు వేల మంది రెజ్లర్లను ఓడించాడు.
సొహైల్ కోచ్ సుశీల్
Published Mon, Jun 9 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement