ట్రాన్స్‌జెండర్‌గా మారిన మాజీ రెజ్లర్‌ | Former WWE Superstar Gabbi Tuft Comes Out as Transgender | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌గా మారిన మాజీ రెజ్లర్‌

Published Sat, Feb 6 2021 3:02 PM | Last Updated on Sat, Feb 6 2021 4:17 PM

Former WWE Superstar Gabbi Tuft Comes Out as Transgender - Sakshi

ట్రాన్స్‌జెండర్‌గా మారిన మాజీ రెజ్లర్‌ గబ్బి టఫ్ట్‌

వాషింగ్టన్‌: మాజీ రెజ్లర్‌, డబ్ల్యూడబ్ల్యూయీ సూపర్‌స్టార్‌ గబ్బి టఫ్ట్‌ సంచలన ప్రకటన చేశారు. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు ప్రకటించారు. మహిళగా మారిన తర్వాత తీసిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘ఇది నేనే.. దీని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడటం లేదు.. భయపటడం లేదు’’ అన్నారు. మహిళగా మారిన ఫోటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్‌ చేశారు గబ్బి. ‘‘నేను చెప్పిన ఈ న్యూస్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది నేనే. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు.. ఇబ్బంది పడటం లేదు. ప్రపంచం ఏమి అనుకుంటుందో అని భయపడి ఇన్నాళ్లు నేను దాచిన నా నీడ ఇది. నా కుటుంబం, స్నేహితులు, అనుచరులు దీని గురించి ఎంతో భయపడ్డారు. నేను ఇక దేనికి భయపడను. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.. ఎలా ఉన్నా నన్ను నేను అమితంగా ప్రేమించుకోగలను’’ అన్నారు.  

కుటుంబం మద్దతుకి కృతజ్ఞతలు
‘‘గత ఎనిమిది నెలలు నా మొత్తం జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాన్స్‌ జెండర్‌గా మారిన తర్వాత ప్రపంచాన్ని ఎదుర్కొవాలంటే ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది.  ఈ రోజు ఇతరులు నా గురించి ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకున్న రోజు. నా అస్తిత్వాన్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమించే నా భార్య, కుటుంబం, సన్నిహితులు నన్ను అంగీకరించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారి మద్దతు నాకు ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. 

బాహ్య రూపం మాత్రమే మారింది
‘‘ఇక ప్రస్తుతం నన్ను అందరూ అంగీకరిస్తారా లేదా అనే విషయం గురించి నేను పట్టించుకోవడం లేదు. నా బాహ్య రూపం మాత్రమే మారింది.. అంతరాత్మ అలానే ఉంది. ఇక నాలోని ఈ మార్పు గురించి మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు.. నేను వాగ్దానం చేసినట్లుగానే వాటన్నింటికి తర్వలోనే సమాధానం చెప్తాను. రేపు ఎక్స్‌ట్రాలో, బిల్లీ బుష్‌తో నా ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. దీనిలో అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. నా ప్రయాణంలో పారదర్శకంగా.. నిజాయతీగా ఉంటానని ప్రమాణం చేశాను. అలానే కొనసాగుతాను. ఇది నేనే.. ఎప్పటికి మిమ్మల్ని ఎంతో ప్రేమించే గబ్బి అలోన్‌ టఫ్ట్‌’’ అంటూ ముగించారు.

2007 నుంచి రెజ్లింగ్‌ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్‌కు వీడ్కోలు పలికారు. ఇక కెరీర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రా, స్మాక్‌డౌన్, రెసిల్ మేనియాలతో తలపడ్డారు. రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌ అయిన తరువాత.. తన భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువ సమయం గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్‌గా కెరీర్‌ని రీస్టార్ట్‌ చేశారు.
చదవండి: బాల బాహుబలి ఇక లేడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement