డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఇంట తీవ్ర విషాదం | WWE 'Hall of Fame Kevin Nash Son Tristen Nash Passed Away At Age 26 | Sakshi
Sakshi News home page

Kevin Nash: డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం కెవిన్‌ నాష్‌ ఇంట తీవ్ర విషాదం

Published Sat, Oct 22 2022 11:36 AM | Last Updated on Sat, Oct 22 2022 11:48 AM

WWE 'Hall of Fame Kevin Nash Son Tristen Nash Passed Away At Age 26 - Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ కెవిన్‌ నాష్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కెవిన్‌ నాష్‌ కుమారుడు 26 ఏళ్ల ట్రిస్టన్‌ నాష్‌ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ఈ విషయాన్ని రెజ్లింగ్‌  రిపోర్డర్‌ సీన్‌ రోస్‌ సాప్‌ వెల్లడించాడు. కాగా ట్రిస్టన్‌ నాష్‌ మృతి వెనుక కారణాలను రివీల్‌ చేయడానికి అతని కుటుంబసభ్యులు ఇష్టపడలేదని రోస్‌ సాప్‌ ట్వీట్‌ చేశాడు.

''కెవిన్‌ నాష్‌, తమరా నాష్‌ల తనయుడు ట్రిస్టన్‌ నాష్‌ 26 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం బాధాకరం. తన తండ్రితో కలిసి ఇటీవలే పాడ్‌కాస్ట్‌ ఆరంభించిన ట్రిస్టన్‌ సరదాగా ఎంజాయ్‌ చేస్తున్న టైమ్‌లో ఇలా జరగడం దురదృష్టకరం. కుటుంబసభ్యుల వినతి మేరకు ట్రిస్టన్‌ మరణంపై ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా ట్రిస్టన్‌ ఆత్మకు శాంతి చేకూరాలిన భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అంటూ తెలిపాడు. 

డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్‌.. మిక్‌ ఫోలీ(డిక్సీ కార్టర్‌) స్పందిస్తూ.. నా ప్రియమైన మిత్రుడు కెవిన్‌ నాష్‌ గుండె పగిలే వార్త నన్ను ఇబ్బంది పడుతుంది. ట్రిస్టన్‌ నాష్‌ ఇంత చిన్న వయసులో మనల్ని విడిచిపెట్టి వెళ్లడం దురదృష్టకరం. కెవిన్‌ నాష్‌ సహా అతని కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానభూతి అంటూ ఎమెషనల్‌ అయ్యాడు.

ఇక కెవిన్‌ నాష్‌ 1990లో అప్పటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌(ఇప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ)లో ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. 2020లో రెజ్లింగ్‌కు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. డీజిల్‌(Diesel), బిగ్‌ డాడీ కూల్‌(Big Daddy Cool) పేర్లతో పాపులర్‌ అయిన కెవిన్‌ నాష్‌ తన కెరీర్‌లో చీటింగ్‌ చేసి ఎక్కువ విజయాలు సాధించడం గమనార్హం.

ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌, ఇంటర్‌కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌ ఒకసారి, రెండుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌టీమ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2015లో వ్యక్తిగతంగా డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా నిలిచన కెవిన్‌ నాష్‌.. 2020లో మరోసారి న్యూ వరల్డ్‌ ఆర్డర్‌(NWO) తరపున రెండోసారి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఇండక్టివ్‌లో చోటు దక్కించుకున్నాడు.

చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ.. జర్నలిస్ట్‌ కన్నీటి పర్యంతం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement