సందీప్ తోమర్ అవుట్ | Sandeep Tomar Out | Sakshi
Sakshi News home page

సందీప్ తోమర్ అవుట్

Published Sat, Aug 20 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

సందీప్ తోమర్ అవుట్

సందీప్ తోమర్ అవుట్

రియో డి జనీరో: పురుషుల 57కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ సందీప్ తోమర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తను రష్యాకు చెందిన విక్టర్ లెబెడేవ్ చేతిలో 3-7 తేడాతో ఓడాడు. ఆరు నిమిషాల ఈ బౌట్‌లో సందీప్ ఏ దశలోనూ ప్రత్యర్థిపై పట్టు సాధించలేకపోయాడు. ఆదిలోనే 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విక్టర్ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో సందీప్‌కు రెప్‌చేజ్ అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో తను రియో నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది.

 
34వ స్థానంలో సందీప్ కుమార్

50 కి.మీ రేసు నడక ఫైనల్లో సందీప్ కుమార్ 4:07:55 టైమింగ్‌తో 34వ స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మటెజ్ టోత్‌కన్నా తను 26 నిమిషాల 57 సెకన్ల ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకున్నాడు. 80 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసును 48 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement