ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది.
న్యూఢిల్లీ : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది. దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో బుధవారం జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో ఆమె... వియత్నాంకు చెందిన థి లొన్ నైగుయెన్‌ను కంగుతినిపించింది. పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరీలో హితేందర్ కూడా కాంస్యపతక పోటీకి అర్హత సంపాదించాడు.