
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఒలింపిక్ పతక విజేత
Ronda Rousey Blessed With Baby Girl: అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్(యూఎఫ్‌సీ) మాజీ చాంపియన్, ఒలింపిక్ పతక విజేత రోండా రౌసే తల్లయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రౌసే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాపకు లాకియా మకాలపుఓకలానిపో బ్రౌనీగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. కాగా అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన రోండా రౌసే.. యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్లలోనూ పాల్గొన్న ఆమెను అభిమానులు ముద్దుగా ‘రౌడీ’(దివంగత కెనడియన్ రెజ్లర్ రాడీ పైపర్ పేరు మీదుగా) అని పిలుచుకుంటారు.
కాగా రోండా 2017లో ట్రవీస్ బ్రౌనీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఇక రెజ్లర్‌గా రాణిస్తున్న రోండా.. అమెరికన్ టీవీ తెరపై నటిగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
చదవండి: MS Dhoni: ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే!