సందీప్ యాదవ్‌కు నిరాశ | sandeep yadav loses in world wrestling championship | Sakshi
Sakshi News home page

సందీప్ యాదవ్‌కు నిరాశ

Published Sun, Sep 14 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

సందీప్ యాదవ్‌కు నిరాశ

సందీప్ యాదవ్‌కు నిరాశ

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

తాష్కెంట్: గతేడాది మూడు పతకాలు నెగ్గి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ ఈసారి రిక్తహస్తాలతో తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. నిరుడు గ్రీకో రోమన్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన సందీప్ తులసీ యాదవ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. 66 కేజీల విభాగంలో పోటీపడిన ఈ మహారాష్ట్ర రెజ్లర్ ఈసారి రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు.

తొలి రౌండ్‌లో సందీప్ 5-2తో మతౌస్ మొర్బిట్జెర్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... రెండో రౌండ్‌లో 5-6తో హసన్ అలియెవ్ (అజర్‌బైజాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అలియెవ్ ఫైనల్‌కు చేరుకోకపోవడంతో సందీప్‌క కనీసం కాంస్యం కోసం నిర్వహించే ‘రెప్‌చేజ్’ బౌట్‌లలో పోటీపడే అవకాశం రాలేదు. 80 కేజీల విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ ‘రెప్‌చేజ్’ రెండో రౌండ్ బౌట్‌లో 0-5తో బోజో స్టార్‌సెవిచ్ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 130 కేజీల విభాగంలో ధర్మేందర్ దలాల్ తొలి రౌండ్‌లో 0-6తో తినలియేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement