
మరో నిర్లక్ష్యం.. మరో ప్రాణం: సెహ్వాగ్
ట్విట్టర్ లో ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో ఆకట్టుకుని మన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఈసారి ఆగ్రహంతో కూడిన ట్వీట్ చేశాడు.
న్యూఢిల్లీ: ట్విట్టర్ లో ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో ఆకట్టుకుని మన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఈసారి ఆవేదనతో కూడిన ట్వీట్ చేశాడు. మరో నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైందంటూ అధికారుల అలసత్వంపై సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహ్ం వ్యక్తం చేశాడు. దీనికి కారణం ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో ఓ 25 ఏళ్ల జాతీయ స్థాయి రెజ్లర్ దుర్మరణం చెందడమే. రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విశాల్ కుమార్ వర్మ అనే రెజ్లర్ కరెంట్ షాక్ తో మృతిచెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేడియంలోకి వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ అయి విశాల్ మృత్యువాత పడ్డారు. అక్కడ స్నానం చేయడానికి బాత్ రూంలోకి వెళ్లిన అతనికి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతను మృతిచెందాడు.
దీనిపై సెహ్వాగ్ ఆవేదన చెందాడు. 'మరో నిర్లక్ష్యానికి ఒక జాతీయ స్థాయి రెజ్లర్ ను పోగుట్టుకున్నాం'అంటూ ట్వీట్ చేశాడు. నీరు నిలిచిపోయిన స్టేడియంలో విద్యుత్ షాక్ తో విశాల్ వర్మ మృతి చెందడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం. ఇది నిజంగా ఘోరం''అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Another Negligence.We have lost a National Wrestler #VishalKumarVerma ,due to electrocution at this water logged stadium in Ranchi.Pathetic! pic.twitter.com/yiumQxRuHk
— Virender Sehwag (@virendersehwag) 12 August 2017