భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు వినేష్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో తలపడాల్సిన వినేశ్.. ఆధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే.
బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేశ్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ క్రమంలోనే తన ఇష్టమైన క్రీడకు వినేశ్ విడ్కోలు పలికింది. "నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించిండి.
మీ కల, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్(2001-2024) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఎక్స్‌లో వినేశ్ రాసుకొచ్చింది.
కాగా ఈ విశ్వక్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ పై 140 కోట్ల భారతీయలు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగాట్‌తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు విభాగం (50కేజీ) కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేశ్‌పై అనర్హత వేటు పడింది.
కాగా ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్భిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
Comments
Please login to add a commentAdd a comment