డోపింగ్ టెస్టుల్లో మరో రెజ్లర్ విఫలం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు భారత్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో రెజ్లర్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. రెజ్లర్ సందీప్ తులసి యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణయింది.
అంతకుముందు భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడం భారత ఒలింపిక్స్ బృందంలో కలకలం రేపుతోంది. అతడు నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లుజాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్ధారించింది. దీంతో ఇద్దరు భారత రెజ్లర్లు ఒలింపిక్స్ కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.