sandeep tulsi yadav
-
మా భోజనంలో ఎవరో ఆ డ్రగ్స్ కలిపారు
భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబట్టాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ చెబుతున్నారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్‌లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందీప్ చెప్పాడు. తాను డోపీగా తేలినట్టు వచ్చిన వార్త విని షాకయ్యానని చెప్పాడు. నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతని కోచ్ జగ్మల్ సింగ్ కూడా కుట్ర జరిగిందని ఆరోపించాడు. నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మద్దతుగా నిలిచింది. -
డోపింగ్ టెస్టుల్లో మరో రెజ్లర్ విఫలం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు భారత్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో రెజ్లర్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. రెజ్లర్ సందీప్ తులసి యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణయింది. అంతకుముందు భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడం భారత ఒలింపిక్స్ బృందంలో కలకలం రేపుతోంది. అతడు నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లుజాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్ధారించింది. దీంతో ఇద్దరు భారత రెజ్లర్లు ఒలింపిక్స్ కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
గ్రీకో-రోమన్ కుస్తీలో భారత్‌కు తొలి పతకం
భారత కుస్తీ వీరుడు సందీప్ తులసీ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకం అందించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా సెర్బియాకు చెందిన మాకిస్మోవిక్ అలెగ్జాండర్‌ను ఓడించి.. కాంస్యపతకం సాధించాడు. ఇన్నాళ్లూ కేవలం ఫ్రీస్టైల్ విభాగంలో మాత్రమే భారత రెజ్లర్లు తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. కానీ యాదవ్ ఇప్పుడు చరిత్రను తిరగరాసి, గ్రీకో రోమన్ విభాగంలోనూ తమ సత్తాకు ఎదురులేదని చాటాడు. కాంస్యపతకం కోసం జరిగిన పోరులో సెర్బియన్ ప్రత్యర్థిని 4-0 స్కోరు తేడాతో చిత్తుచేశాడు. ఎలిమినేషన్ రౌండులో సందీప్‌కు బై లభించింది. రెండో రౌండులో అతడు స్పానిష్ రెజ్లర్ నవర్రో సాంచెజ్ ఇసామెల్ను 5-0తోను, మూడో రౌండులో మాల్దీవ్స్‌కు చెందిన అకోస్నిసెను మిహాలీని 6-2 స్కోరుతోను ఓడించాడు. కానీ తర్వాతి రౌండులో మాత్రం కొరియన్ వీరుడు ర్యు హన్ సు చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. అయితే.. హన్ సు ఫైనల్లోకి వెళ్లడంతో కాంస్యపతకం రేసులోకి యాదవ్ దూసుకెళ్లాడు. ఈసారి ఏమాత్రం పొరపాటు చేయకుండా అలెగ్జాండర్‌ను 4-0 తేడాతో చిత్తుచేశాడు.