ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీ
బిషె్కక్ (కిర్గిస్తాన్): భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు సమాయత్తమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వినేశ్ బరిలోకి దిగనుంది.
వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు అయినప్పటికీ ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి అంతిమ్ పంఘాల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దాంతో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి వినేశ్ పోరాడింది.
Comments
Please login to add a commentAdd a comment