బాలనటి నుంచి మహానటి వరకు... | Raghavendra Rao Condolence on Sridevi Demise | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 25 2018 12:53 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Raghavendra Rao Condolence on Sridevi Demise - Sakshi

సాక్షి, సినిమా : శ్రీదేవికి స్టార్‌ స్టేటస్‌ అందించటంలో ముఖ్య పాత్ర పోషించిన దర్శకులెవరంటే ముందుగా వినిపించే పేరు కే రాఘవేంద్ర రావుదే. దర్శకేంద్రుడి డైరెక్షన్‌లోనే పదహారేళ్ల వయసు చిత్రంతో ఆమె హీరోయిన్‌గా మారారు. ఆపై ఆయన తెరకెక్కించిన వేటగాడు, జస్టిస్‌ చౌదరి,  గజదొంగ, కొండవీటి సింహం, దేవత, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలతో బ్లాక్‌ బస్టర్లు అందుకుని స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగారు.

ఆమె హఠాన్మరణ నేపథ్యంలో  ఆయన స్పందించారు. పదహారేళ్ళ వయసు నుంచి అతిలోక సుందరి వరకు....  తెలుగు తమిళ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు... శ్రీదేవి అధిరోహించని మైలు రాయి లేదంటే అతిశయోక్తి కాదు...అంటూ ట్వీట్‌ చేశారు.

‘బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠాన్మరణం అత్యంత బాధాకరం . భారతీయ చిత్ర పరిశ్రమ కి తీరని లోటు.. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement