
సాక్షి, ముంబయి : చాలాకాలంపాటు సినిమాలకు దూరంగా ఉండి మరోసారి ఇంగ్లిష్ వింగ్లిష్ అనే చిత్రంతో తళుక్కున మెరిశారు శ్రీదేవి. అది ఆమెకు దాదాపు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆ చిత్రంలో చాలా అద్భుతంగా శ్రీదేవిని చూపించారు ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే. గురువారం ఆమె తన ట్విటర్ ఖాతాలో శ్రీదేవితో తనకు ఎంతటి ఎమోషన్ ఉందో ఒక్క ట్వీట్ ద్వారా చెప్పారు.
'శ్రీ... వచ్చే వారం నిన్ను చూడలేననే నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఇటీవలె శ్రీదేవిని కలిసి రెండు స్వీయ చిత్రాలు కూడా ట్విటర్‌లో పెట్టారు. త్వరలోనే మళ్లీ వస్తున్నాం అంటూ అందులో పెట్టారు. సీక్వెల్ చిత్రం చేద్దామనుకున్నారు. కానీ, శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో గౌరీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Sri ... I still refuse to believe that I won't be seeing you next week... pic.twitter.com/5DeAWnfqUg
— Gauri Shinde (@gauris) 1 March 2018