నండూరి ఉదయ్‌కిరణ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, కాకినాడ: యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. (చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి)
పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్ నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్ కేసు పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్‌కు 2016లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు.
Comments
Please login to add a commentAdd a comment