
Ambareesh Murty Instapost viral ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు సీఈవో అంబరీష్ మూర్తి ఆకస్మిక మరణం తరువాత ఏ నిమిషానికి ఏం జరుగునో..ఈ మాటలు కచ్చితంగా గుర్తొస్తాయి ఎవరికైనా. లేహ్‌లో విహార యాత్రలో ఉండగా గుండెపోటుతో మూర్తి కన్నుమూయడం దిగ్ర్భాంతికిగురించి చేసింది. ఈసందర్బంగా ఆగస్టు 6న ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ వీడియో వైరల్‌గా మారింది. మోటార్ సైకిల్ డైరీస్ (వై మీ :)?)" అని టైటిల్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
బైకర్, ట్రెక్కర్ మూర్తి మోటార్‌సైకిల్‌తో కొన్ని గేర్ సమస్యలను ఎదుర్కొన్న తర్వాత దేవుడు తనను "దేవదూత"గా అంగీకరించడానికి "తిరస్కరించాడు" అని ప్రకటించారు. లడఖ్ ట్రిప్‌లో "ప్రతి బైకర్‌కి స్వర్గం" అంటూ లడఖ్ రోడ్లను ప్రశంసించిన ఆయన ఈ ట్రిప్‌లో తనకెదురైన సమస్య గురించి మాట్లాడుతూ, "నాకు గేర్ ట్రబుల్స్ మొదలయ్యాయి. నేను నా బైక్ థర్డ్, ఫోర్త్, ఫిప్త్ ఐదవ గేర్‌లను యాక్సెస్ చేయలేకపోయాను. అందుకే ఒక గేర్‌పై, ఫస్ట్, అండ్ సెకండ్‌లోవెళ్లా. చివరికి ఐన్‌స్టీన్ ఏమి చేస్తాడో అదే చేసా..ఒక పెద్ద రాయిని తీసుకొని గేర్ పెడల్‌ను కొట్టాను,ఆ తర్వాత అంతా బాగానే ఉంది." అన్నారు. కానీ అంతలోనే అనంతలోకాలకు తరలిపోవడం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానలను విషాదంలో ముంచేసింది.
లేహ్ పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు మరో సహ వ్యవస్థాపకుడు ఆశీష్ షా సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బైక్ రైడ్ అంటే ఎంతగానో ఇష్టపడే మూర్తి.. తరచుగా మోటార్‌సైకిల్‌పై ముంబై నుంచి లేహ్‌కు వెళ్లేవారు. మూర్తి మృతిపై స్పాటిఫై ఇండియా ఎండీ అమర్‌జిత్ బాత్రా, డ్రూమ్ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్, క్యాష్‌కరో కో-ఫౌండర్ స్వాతి భార్గవ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1994లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివిన మూర్తి ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత క్యాడ్‌బరీస్, ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్), లివైస్, ఈబే ఇండియా తదితర సంస్థల్లో పని చేశారు. 2011లో ఆశీష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని ప్రారంభించారు.