
దుబాయ్ రాజకుమారుడి హఠాన్మరణం
దుబాయ్ రాజు కుమారుడు హఠాన్మరణం చెందాడు. రాజుగారి పెద్ద కొడుకైన షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (33) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అల్ మక్తౌమ్ అంతిమయాత్ర శనివారం జరగనుంది. అనంతరం దుబాయ్లో మూడు రోజుల సంతాప దినాలు మొదలుకానున్నాయి.
దుబాయ్ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పెద్ద కుమారుడే అల్ మక్తౌమ్. అల్ మక్తౌమ్ అధికారిక ఫేస్ బుక్ పేజి చూస్తే.. ఆయన అనేక క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫొటోలు కనిపించాయి.