సునందా పుష్కర్కు బాలీవుడ్ నివాళులు | B-Town mourns death of 'full of life' Sunanda Pushkar | Sakshi
Sakshi News home page

సునందా పుష్కర్కు బాలీవుడ్ నివాళులు

Published Sat, Jan 18 2014 1:52 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునందా పుష్కర్కు బాలీవుడ్ నివాళులు - Sakshi

సునందా పుష్కర్కు బాలీవుడ్ నివాళులు

ఆశా భోంస్లే, శ్రీదేవి, షబానా అజ్మీ లాంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. సోషల్ సర్కిళ్లలో చాలా చురుగ్గా వ్యవహరించిన సునంద ముఖ్యంగా పేజ్౩లో ఎక్కువగా కనిపించేవారు. అలాంటిది ఆమె శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఓ హోటల్లో మరణించి కనిపించారు. ఆమె మరణంపై పలువురు తమ సంతాపాలు తెలిపారు. ఎవరేమన్నారంటే..

ఆశా భోంస్లే: సునంద విషయం తెలిసి షాకయ్యాను. శశి థరూర్, సునంద కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
శ్రీదేవి: చాలా చురుగ్గా, ఎంతో ఆప్యాయంగా, ఉత్తేజపూరితంగా ఉండే సునందా పుష్కర్ మృతి చాలా విషాదకరం. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక
షబానా అజ్మీ: సునంద విషాదాంతం చాలా బాధాకరం. ఆమె చాలా చురుగ్గా, ఆప్యాయంగా ఉండేవారు. ఆ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి
ఫర్హాన్ అక్తర్: సునందా పుష్కర్ మరణం చాలా విషాదకరం. శశిథరూర్ కుటుంబానికి సానుభూతి.
జూహీ చావ్లా: సునంద విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందాను. నిన్నటి వరకు మాతోనే ఉండి, కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లలో కూడా చాలా సరదాగా ఉండేవారు. ఇప్పుడు లేరంటే బాధగా ఉంది.
సోహా అలీఖాన్: సునంద విషయం తెలిసి షాకయ్యాను. ఆమె జీవితంలో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేవారు, వెలుగులు విరజిమ్మేవారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నా. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
జావేద్ అక్తర్: సునంద లాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆమె జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేవారు, పదిమందితో సరదాగా ఉండేవారు. ఆ సరదాలు, సంతోషాలు ఇక లేవు. శశీజీకి నా సానుభూతి.
శేఖర్ కపూర్: సునందా థరూర్ మృతి అతిపెద్ద విషాదం. నిన్న రాత్రి 7.30 గంటలకే శశి థరూర్ మాట్లాడుతుంటే వింటూ ఢిల్లీ నుంచి బయల్దేరాను. ముంబై చేరుకునే సరికి ఆమె మరణవార్త తెలిసింది.
అనుపమ్ ఖేర్: సునందాపుష్కర్ జీవితాన్ని బాగా ఆస్వాదించేవారు. జీవితం కంటే ఆమే ఎక్కువ. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. ఆమె మరణం చాలా దురదృష్టకరం.
సోను సూద్: సునందా పుష్కర్ గురించి తెలిసి షాకయ్యాను. జీవితం గురించి ఏమీ ఊహించలేం. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక.
కైలాష్ ఖేర్: సునందా పుష్కర్ విషాదాంతం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. త్వరలోనే దుబాయ్లో జరిగే వాళ్ల కార్యక్రమంలో నేను పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. రిప్ సునంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement