
కూసుమంచి: చట్టసభల్లో మోసగాళ్లకు చోటు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అవి దేవాలయాలతో సమానమని, అందుకే తమ బాధ్యతగా ఫిరాయింపులపై పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. నిలదీస్తామనే భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సీఎల్పీని విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల విషయమై రాష్ట్రపతిని కలసి విషయాన్ని వివరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment