
బాధ్యతలు స్వీకరిస్తున్న గజ్జెల నగేశ్. చిత్రంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన టీఆర్‌ఎస్ నేతలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని టీఎస్‌ఎండీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిషాంక్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్‌లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. మన్నె క్రిషాంక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరై అభినందించారు.
నూతన టీఎస్‌టీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పాటిమీది జగన్మోహన్‌రావును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. అనంతరం బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా గజ్జెల నాగేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరై అభినందనలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment