Manne Krishank
-
అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్ట్‌పై బుధవారం ఆయన స్పందించారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ అన్నారు.‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్‌ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడలో ఉండాలో తేలిపోతది. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. క్రిశాంక్‌ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్‌పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024 -
ఇందిరమ్మరాజ్యంలో ఎమర్జెన్సీ పాలన
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మరాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెస్తోందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, జగన్ మోహన్‌రావు, దినేశ్ చౌదరితో కలిసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తన పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్‌తోపాటు తన పీఆర్ఓ, పీఏ ఫోన్లను మొబైల్ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నా రని చెప్పారు. తమ ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డికి చేరవేసినట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు. తమ ఫోన్లను, పాస్‌పోర్ట్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చిత్రపురి కాలనీలోనే రూ.3వేల కోట్ల మేర అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ చేసిన ఆరోపణలను మాత్రమే తాను ప్రస్తావించానని పునరుద్ఘాటించారు. చిత్రపురికాలనీ అక్ర మాలపై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చిత్రపురి సొసైటీకి చెందిన అనుముల మహనందరెడ్డి ఎవరో తెలియదని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయనతో సీఎం దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసినా అణచివేత చర్యలకు పాల్పడలేదన్నారు. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన టీఆర్ఎస్ నేతలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని టీఎస్ఎండీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిషాంక్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. మన్నె క్రిషాంక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరై అభినందించారు. నూతన టీఎస్టీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పాటిమీది జగన్మోహన్రావును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. అనంతరం బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా గజ్జెల నాగేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరై అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. -
మామపై రెబెల్‌గా పోటీ చేస్తా..!
సాక్షి, హైదరాబాద్: ‘నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు.. క్రిశాంక్ మాత్రమే. ఉస్మానియా విద్యార్థి నేతగా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితుడిని. 6 నెలలుగా నియోజకవర్గంలో బస్తీ నిద్రలు చేసి ప్రజలకు చేరువయ్యాను. మా జేబులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఎవరో వచ్చి టికెట్ ఎగరేసుకుపోతే ఎలా.. ఈ రోజు మా మామ.. రేపు ఇంకో పారాచూట్ నేత.. ఇంక మాకు ఓపిక లేదు. నేను రెబ ల్గా పోటీచేసేందుకే సిద్ధమవుతున్నా’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్ అన్నారు. ఓయూ విద్యార్థి నేత అయిన క్రిశాంక్‌కు గత ఎన్నికల్లో త్రుటిలో కంటోన్మెంట్ టికెట్ చేజా రింది. గత ఎన్నికల సందర్భంగా తన పేరును అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో మార్పు చేశారు. అయినా ఆయన అప్పటి నుంచి పార్టీలో కొనసాగు తూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రియాశీలకం గా పనిచేస్తున్నారు. తన మామ సర్వేకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై క్రిశాంక్ గళం విప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 3 సార్లు ఓడిపోయిన సర్వేకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ఎవరో ప్రజలకు తెలియదు.. సర్వే సత్యనారాయణ ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలియదని, తన పేరు అందరికీ తెలుసని క్రిశాంక్ చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఒక్క ఓయూ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ టికెట్ రావాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలని వ్యాఖ్యానించారు. -
‘నా పేరు సత్యనారాయణ అల్లుడు కాదు’
సాక్షి, హైదరాబాద్: తన మామ సర్వే సత్యనారాయణపై రెబల్‌గా పోటీ చేస్తానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ రాకుండా తన మామ అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు ఓడిపోయిన తన మామకు టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘నా పేరు క్రిశాంక్ మాత్రమే. నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు. నాకు టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో నేను 6 నెలలుగా బస్తీ నిద్ర చేసి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాను. మా జేబులు ఖాళీ అయ్యాయి. నేను 2 పైసల పనిచేయలేదని, ఓడిపోతానని సర్వే సత్యనారాయణ ప్రచారం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంట్లో పది మంది ముందు నన్ను దారుణంగా అవమానించారు. డబ్బులు ఉంటేనే టికెట్ వస్తుందని, 10 కోట్లు ఖర్చుపెట్టాలి నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆశయాలను నరనరాల్లో జీర్ణించుకున్నాం. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల నాకు టికెట్ దక్కలేదు. ఇంకా వేచిచూసే ఓపిక మాకు లేదు. మళ్లీ ఎవరో ఒక పారాచూట్ నాయకుడు వస్తాడు. తొలి జాబితాలో ఒక్క ఓయూ విద్యార్ధికి కూడా టికెట్ దక్కకపోవడం అత్యంత బాధాకరం. అందుకే నేను రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నా’నని క్రిశాంక్ తెలిపారు. న్యాయంగా నాకే దక్కాలి సర్వే సత్యనారాయణ లోక్‌సభకు పోటీ చేస్తారని, ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారన్న ఉద్దేశంతో క్రిశాంక్ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సొంత మామ తన టిక్కెట్‌ను ఎగరేసుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. న్యాయంగా కంటోన్మెంట్ టికెట్ తనకే దక్కాలని ఆయన అంటున్నారు. సర్వే సత్యనారాయణ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయకుండా, ఇక్కడ ఎందుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదని క్రిశాంక్ వాపోయారు. 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా క్రిశాంక్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరి క్షణాల్లో టికెట్ దక్కలేదు. -
‘కేసీఆర్‌కు జబ్బు చేసినట్టుంది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల పైన దుర్మార్గంగా మాటల దాడి చేస్తున్న కేసీఆర్‌కు ఏదో మానసిక జబ్బు సోకిందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా బూతు పురాణం మాట్లాడడని అన్నారు. అహంకారంతో కళ్లుమూసుకుపోయిన కేసీఆర్ భారత రత్న నెహ్రు పైన కూడా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని పేర్కొంటూ కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విలీన సమయంలో.. ఒకవేళ ప్రజలకు పొసగక పోతే ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చని నెహ్రూ చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు మరచిపోయాడని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక, ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాడు యువజన నాయకుడిగా ఎందుకు కొనసాగాడని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ఎలా పెంచాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ‘తూ’ అంటున్నాడని విమర్శించారు. ‘నోటీ దూల ఉంటే మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకులపై బూతు పురాణం మొదలు పెట్టు.. మా పార్టీ నాయకులపై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు’ అని శ్రవణ్ హెచ్చరించారు. వైఎస్సార్ సేవలు కనిపించడం లేదా.. రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్ల రూపాయలుగా ఉన్న రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ రోజు 2లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌తో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఏ ఏపాటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 108,104, ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చినందుకా.. రింగ్ రోడ్డు వేయించినందుకా.. అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకా.. ట్రిపుల్ ఐటీ, ఆరోగ్యశ్రీ, లక్షల ఎకరాలకు నీళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా .. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నావని కేసీఆర్‌ను దుయ్యబట్టారు. ‘ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలు కోసం ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. దొంగ ఓట్లను ఇంతవరకు సరిదిద్దలేదు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ఇద్దరు కూతుర్లలో ఒకరి ఓటు కంటోన్మెంట్లో.. మరొకరి ఓటు ముషీరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పరిస్థితికి ఇదే తార్కాణం’అని ఎద్దేవా చేశారు.