బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్
నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు సీజ్ చేశారు
చిత్రపురిలో కుంభకోణంపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మరాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెస్తోందని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, జగన్ మోహన్‌రావు, దినేశ్ చౌదరితో కలిసి గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా తన పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్‌తోపాటు తన పీఆర్‌ఓ, పీఏ ఫోన్లను మొబైల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నా రని చెప్పారు. తమ ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డికి చేరవేసినట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు. తమ ఫోన్లను, పాస్‌పోర్ట్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చిత్రపురి కాలనీలోనే రూ.3వేల కోట్ల మేర అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ చేసిన ఆరోపణలను మాత్రమే తాను ప్రస్తావించానని పునరుద్ఘాటించారు.
చిత్రపురికాలనీ అక్ర మాలపై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చిత్రపురి సొసైటీకి చెందిన అనుముల మహనందరెడ్డి ఎవరో తెలియదని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయనతో సీఎం దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసినా అణచివేత చర్యలకు పాల్పడలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment