
అనంతగిరి: టీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వెంకట్రాంపురం, వాయిలసింగారం, త్రిపురవరం, చనుపల్లి గ్రామాలలో ఆదివారం ఆయన పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.
ప్రతి గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీపై ఇచ్చిన హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్ర కేబినెట్‌లో ఉన్నత స్థాయిలో తెలంగాణ రథసారథులు ఉంటారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. డబ్బుకోసం పార్టీ మారిన రాజకీయ నాయకులు తల దించుకునేలా ప్రజల నిర్ణయం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వాసు, ముస్కు శ్రీనివాసరెడ్డి, బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి పాల్గొన్నార