
‘నయీమ్’ నేతలపై వేటు?
♦ గ్యాంగ్‌స్టర్ వ్యవహారంలో కేసీఆర్ సీరియస్
♦ ఏడుగురు టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలకు రంగం సిద్ధం
♦ క్రిమినల్ కేసుల నమోదుకు అనుమతి!
♦ ఆనక పార్టీ నుంచి సస్పెన్షన్‌కు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన నేతలపై వేటు పడనుందా? వారిని టీఆర్‌ఎస్ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధమవుతోందా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారా?.. ఈ ప్రశ్నలకు పోలీసు అధికారుల నుంచి అవుననే సమాధా నమే వస్తోంది. నయీమ్‌ను మట్టుబెట్టడం ద్వారా వచ్చిన మంచి పేరును కాపాడుకు నేందుకు కఠినమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం అతడి డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పోలీసులకు కీలకమైన సమాచారం లభించింది. దాని ఆధారంగా చర్యలు ప్రారంభించగా.. ఇప్ప టికే ఐదుగురు పోలీసు అధికారులపై సస్పె న్షన్ వేటుపడింది. ఇక రాజకీయ నేతల వంతు వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు చెం దిన పలువురు నేతలకు నయీమ్‌తో ఉన్న సంబంధాలు, సెటిల్‌మెంట్లకు సంబంధించిన ఆధారాలు పోలీ సులకు లభించాయి.
ఏడుగురు నేతలపై చర్యలు!
విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వా నికి, అధికార పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండాలంటే నయీమ్‌తో సంబంధాలున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు వివరిం చారని సమాచారం. దీంతో ఆయా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కేసు నమోదైన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, మరో ఇద్దరు నేతలు మొత్తంగా ఏడుగురిపై చర్యలు తీసుకో ను న్నారని విశ్వసనీయ సమా చారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన భేటీలో పచ్చ జెండా ఊపారని చెబుతున్నారు. వీరిలో గతంలో కాం గ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులే ముగ్గురు ఉన్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపైనా క్రిమినల్ కేసులు పెట్టనున్నారని తెలిసింది.
క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల కోసం వేట
పార్టీ నేతల పనితీరుపై కేసీఆర్ దృష్టి సారిం చారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ముం దస్తుగానే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల జాబి తా తయారు చేయిస్తున్నారని తెలు స్తోంది. కేసీఆర్ ఈనెల మొదటి వారంలోనే మూడో అంతర్గత సర్వే కూడా చేయించారు. నయీ మ్‌తో సంబంధాలు నెరిపినవారు, ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో గీత దాటినవారు, నియోజక వర్గాల్లో వివాదాస్పద ఘటనల్లో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వా రిపైనా ప్రత్యేక సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నేతలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.