కల్వకుర్తిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న నాయకుడు, మక్తల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న నాయకుడు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. అయితే చాలా చోట్ల అభ్యర్థుల విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టిక్కెట్లు తమకే దక్కుతాయని భావించిన ఆశావహులు జాబితాపై తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగినా వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. జిల్లాకు చెందిన ఆపద్ధర్మ మంత్రులతో పాటు పార్టీ ముఖ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్ తదితరులు రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసంతృప్త నేతలు ససేమిరా అంటున్నారు. ఎక్కడిక్కడ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు, ముఖ్య అనుచరుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో తమ అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.
కల్వకుర్తిలో కుతకుత
రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక ముద్రవేసుకున్న కల్వకుర్తి రాజకీయం రసకందాయంలో పడింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన జైపాల్‌యాదవ్ విషయంలో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి నిరసన జ్వాలలు రగులుతున్నాయి. అక్కడకు చెందిన బాలాజీసింగ్ అనుచరులు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో నిలవాలని కసిరెడ్డిపై ఆయన అనుచరులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన మాత్రం పార్టీకి వ్యతిరేక పనులు చేయబోనని, అధిష్టానం పునరాలోచన చేస్తే బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నట్లు సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ము ఖ్యనేతలందరూ మంగళవారం కల్వకు ర్తిలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్‌లో ప్ర త్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కల్వకుర్తి మండలంలోని ప్రతీ గ్రామం నుంచి ఒక్కరిద్దరూ ముఖ్యనేతలను పిలిచారు. కల్వకుర్తి జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, ఎంపీపీ నంచాల శ్రీనివాస్ రెడ్డి, ఎనిమిది గ్రామాల మాజీ సర్పంచ్‌లు భేటీ అయ్యారు. సమావేశంలోకి ఫోన్లను అనుమతించకుండా అభిప్రాయ సేకరణ చేపట్టారు. 30శాతం మంది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పగా.. మెజారిటీ నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలిస్తేనే గెలుపు సాధ్యమని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యనేతలందరూ ఈనెల 13న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని నిర్ణయించారు.
మక్తల్‌లో వేరుకుంపటి
మక్తల్ నియోజకవర్గంలో అసమ్మతి నేత ల గళం రోజురోజుకు పెరుగుతోంది. తా జా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్ టిక్కెట్ కేటాయించడం ప ట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకం గా సోమవారం నర్వ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు జలేందర్‌రెడ్డి ని వాసం వద్ద నిర్వహించిన ఆత్మగౌరవ సభలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అసమ్మతి వర్గం నేతలు పా ల్గొన్నారు. బురుజు సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గంగాధర్‌గౌడ్, ఆత్మకూర్ మాజీ ఎంపీపీ గంగాధర్‌గౌడ్, అమరచింత శీలన్‌గౌడ్, మక్తల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, సూర్యనారాయణగుప్త, నీలప్ప, రైతుసమన్వయ స మితి కోఆర్డీనేటర్ రాజశేఖర్‌రెడ్డి, మావిళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కుమారులు ఎల్కోటి నారాయణరెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యనేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో ముందు నుండి పనిచేసిన నాయకులకు గుర్తింపులేదన్నారు. కాంగ్రెస్ నుండి వచ్చి న చిట్టెం.. ఆయన వెంట వచ్చిన నాయకులకే ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు నియోజకవర్గం లోని ఏడు మండలాల్లోని నాయకులకు ఎవరికీ టికెట్ ఇచ్చిన గెలుపునకు కృషిచేస్తామన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల మనోభావాలను గుర్తించి పనిచేసే ఏ నాయకుడికైనా టికెట్ ఇస్తే అందరం కలిసి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. ఇక నుంచి ప్రతీ మండలంలో ఆత్మగౌరవ సభలు నిర్వహించి తమ ఐక్యతను అదిష్టానానికి తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
సంప్రదింపులు చేస్తున్న మందా
గత ఆరేళ్లుగా అలంపూర్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న మాజీ ఎంపీ మందా జగన్నాథం, వారి అనుచరులు తాజా పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయిన జగన్నాథంకు టీఆర్‌ఎస్ అధిష్టానం అన్యాయం చేసిదంటూ ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్రహంకు టిక్కెట్టు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఆదివారం ఇటిక్యాల మండలం కొండేరు గ్రామంలోని తన నివాసంలో మందా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు.
అనుచరులందరూ కూడా పార్టీ అధిష్టానంతో మరోసారి గట్టి ప్రయత్నం చేయాల్సిందిగా సూచించారు. కార్యకర్తలు వెళ్లిపోయిన అనంతరం సమావేశ సమాచారాన్ని తెలుసుకున్న అలంపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అబ్రహం వెంటనే జగన్నాథం నివాసానికి వచ్చారు. అనంతరం జగన్నాథంతో కాసేపు ఏకాంత చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌తో మంగళవారం మంధా జగన్నాథం భేటీ కాగా.. పార్టీ తప్పక న్యాయం చేస్తుందని భరోసా లభించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment