
పూలే చిత్రపటానికి నివాళి
మహబూబ్‌నగర్ రూరల్ : బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణం లోని భాష్యం హైస్కూల్‌లో టీటీసీ (డైట్‌సెట్) ఉచిత కోచింగ్ సెంటర్‌ను టీఆర్‌ఎస్ నాయకుడు బెక్కం జనార్దన్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. టీటీసీ ఉచిత కోచింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలను సాధించవచ్చని సూచించారు.
అనంతరం పదో తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన భాష్యం ఉన్నత పాఠశాల విద్యార్థిని వైష్ణవిని అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాండురంగం, ప్రధాన కార్యదర్శి ఎన్.ప్రభాకర్, డాక్టర్ రమేష్ సరోడే, భాష్యం ప్రిన్సిపాల్ మాధవి, రాంచందర్, శ్యాంప్రసాద్, భాస్కరాచారి, అశోక్‌జీ, శేఖర్, వెంకట్‌రెడ్డి, అంజిరెడ్డి, డాక్టర్ అయ్యన్న, పులి జమున, రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment