సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి ఎట్టకేలకు 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చింది. టీజేఎస్ అధ్యక్షు డు, ప్రజాకూటమి చైర్మన్ కోదండరాం ఆమోదంతో నలుగురి పేర్లను ఖరా రు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజాకూటమిలో భాగంగా టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. మెదక్ నియోజకవర్గం నుంచి జనార్దన్‌రెడ్డి, దుబ్బాక నుంచి చిందం రాజ్‌కుమార్, సిద్దిపేట నుంచి భవానీరెడ్డి పోటీలో ఉంటారని వివరించారు.
వారు ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వివరించారు. మరో 2 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు 8 స్థానాలను ఇస్తామని పేర్కొం దని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. వీటిలో ఆరు స్థానాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వర్ధన్నపేట, అంబర్‌పేట్ నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ గతంలోనే ఓకే చెప్పినా, ఆ స్థానాలను తాము అడగలేదని, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ స్థానాలను తాము అడిగినా ఇవ్వలేదని టీజేఎస్ వర్గా లు పేర్కొన్నాయి.
ఇవికాకుండా మరో 2 స్థానాలను కాంగ్రెస్ తమకు ఇచ్చే అవకాశం ఉందని, అందులో మిర్యాలగూడ, వరంగల్ వెస్ట్ స్థానాలపై స్పష్టత వస్తే వాటికి అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. టీజేఎస్ 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో మహబూబ్‌నగర్, స్టేషన్‌ఘన్‌పూర్ వంటి స్థానా ల్లో స్నేహపూర్వక పోటీకి సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment