
సాక్షి, సిద్దిపేట : ప్రజా కూటమి పేరుతో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేవని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ బారాణా అయితే మిగతా అన్ని పార్టీలు కలిసి చారాణా మాత్రమేనని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘అభివృద్ధి నిలుస్తుంది. ఆత్మగౌరవం గెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన గజ్వెల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
గజ్వెల్, సిద్దిపేటల్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో టీజేఎస్ మూడు సీట్లు తీసుకుని పుణ్యం కట్టుకుందనీ, ఇక మెదక్‌లో 10 సీట్లు గెలవడానికి మార్గం సుగమం అయిందన్నారు. టీఆర్‌ఎస్ మద్యం, డబ్బులు పంచదనీ, చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తామని అన్నారు. గజ్వెల్‌లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment