
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం చివరి దశకి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యడు రాహుల్ గాంధీ నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు పిలుపువచ్చింది. సీట్ల పంపకంపై చర్చించేందుకు శుక్రవారం రాహుల్‌తో కోదండరాం భేటీ కానున్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం కూటమిలో సీట్ల పంపకాలపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే.
మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాన్ని వారు రాహుల్‌కు వివరించారు. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 4 స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గురువారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment