kodhandaram
-
ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానుంది. దీంతో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అంశాలపై ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. అధికార టీఆర్ఎస్ ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెడుతోంది. జిల్లాలో తొలి సమావేశం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరగనుంది. మూడు జిల్లాల పరిధి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఆ పార్టీ.. తక్కెళ్లపల్లి రవీందర్రావును ఇన్చార్జ్గా నియమించిందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి క్షేత్ర స్థాయిలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం) నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తాను పోటీలో ఉంటున్నానని ప్రకటించారు. వీరే కాకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా మరి కొందరు కూడా స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గంనుంచి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. టీఆర్ఎస్లో.. కదలిక టీఆర్ఎస్ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మూడు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఎన్నికకు సమాయత్తం చేయడం.. ముందుగా ఓటర్లుగా నమోదు చేయించడంపై నాయకత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఓ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ తన అభ్యర్థిగా తిరిగి పల్లా రాజేశ్వర్ రెడ్డినే కొనసాగిస్తుందా..? లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్న విషయంపై పార్టీ వర్గాల్లోనూ స్పష్టత లేదు. అయితే.. పార్టీ ఆదేశిస్తే తాను పోటికి సిద్ధంగా ఉన్నానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పార్టీ పెద్దల వద్ద తన సంసిద్ధతను ప్రకటించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో మౌనం! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలో ఉంటారో ఇంకా తేటతెల్లం కాలేదు. కాంగ్రెస్‌నుంచి అభ్యర్థిని పోటీలో పెడతారా..? లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జిల్లానుంచి ఇప్పటివరకూ ఒక్కరి పేరూ కనీస ప్రచారంలోకి రాలేదు. ఈ స్థానంనుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో కొందరు నేతలు ఆశతో ఉన్నా.. నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి మాత్రం ఇప్పటి దాకా ఎవరూ బయట పడలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీల్లో.. హడావుడి మరోవైపు ఈ ఎన్నికల్లో తమ గెలుపు కోసం కలిసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని టీఆర్ఎస్, కాంగ్రెసేతర పార్టీల నాయకులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పోటీపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ జనసమతి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాకే చెందిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమను పోటీకి పెట్టనున్నామని ప్రకటించారు. దీంతో ఈ పార్టీల్లోనూ హడావిడి మొదలైంది. కాగా, సీపీఎం, సీపీఐల నుంచి కూడా పోటీపై ఎలాంటి స్పష్టత లేదు. -
ఈవీఎం వద్దు.. బ్యాలెట్ ముద్దు
హైదరాబాద్: ఈవీఎంల పనితీరుపై ప్రజలు, రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున బ్యాలెట్ పేపర్ విధా నం తీసుకురావాలని మహాకూటమి నేతలు డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నారని గుర్తు చేశారు. ఈవీఎంలపై హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన దేశవ్యాప్త ఉద్యమానికి నాంది అని పేర్కొన్నారు. ఓటరు జాబితా అవకతవకలపై ఎన్నికల కమిషనర్ క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం ధర్నా జరిగింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నానుద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మార్జిన్ ఒక శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంటింగ్ చేయాల్సి ఉండగా వీవీ ప్యాట్ల రీకౌంటింగ్‌కు ఈసీ ఒప్పుకోకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అందుకే బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలన్నారు. తప్పుదోవ పట్టించారు: కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ అందరికీ ఓటుహక్కు ఉన్నదా, లేదా అనే దానిని బట్టి ఏ దేశమైనా ప్రజాస్వామ్య దేశమా, కాదా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారన్నారు. 31, 32 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల మధ్య తేడా ఉందని, దీంతో కొన్నిస్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని, దీనిపై ఇప్పటివరకు ఈసీ కారణా లు చెప్పలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, సీపీఐ నేత అజీజ్ పాషా, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌నేతలు అంజన్‌కుమార్ యాదవ్, నిరంజన్, వినోద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌లు పాల్గొన్నారు. -
రాహుల్ నుంచి కోదండరాంకు పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం చివరి దశకి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యడు రాహుల్ గాంధీ నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు పిలుపువచ్చింది. సీట్ల పంపకంపై చర్చించేందుకు శుక్రవారం రాహుల్‌తో కోదండరాం భేటీ కానున్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం కూటమిలో సీట్ల పంపకాలపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాన్ని వారు రాహుల్‌కు వివరించారు. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 4 స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గురువారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. -
జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం
సాక్షి, సంగారెడ్డి: కంది మండలం కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ తొందరపాట నిర్ణయమన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా అలోచించి జోన్ల వ్యవస్థను తీసుకువచ్చిందని విమర్శించారు. జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే వినియోగదారుల మీద భారం తగ్గుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్ పార్టీని బలోపేతం చేస్తామని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. -
‘పంచాయతీ’ బరిలో కోదండరాం!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘తెలంగాణ జన సమితి’ పోటీ చేయాలని భావిస్తోందని జేఏసీ వర్గాల సమాచారం. ఇటీవలె జేఏసీ చైర్మన్ కోదండరాం తన నూతన పార్టీ తెలంగాణ జన సమితిని ప్రకటించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలో ఒంటరిగానే పోటి చేస్తుందని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో దానికి ముందు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలను ఈ ఏప్రిల్ 4న జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటిస్తారని సమాచారం. ఏప్రిల్ 29న నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తారని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 29న జరిగే బహిరంగ సభలో చాలా మంది ప్రముఖులు, ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని కోదండరాం తెలిపారు. -
నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వట్లేదు
-
కాంగ్రెస్ బాకా కోదండరాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కి బాకాగా మారిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టడమో, లేదా ఏదో ఒక పార్టీ పంచన చేరడంపై స్పష్టమైన సంకేతం ఇచ్చిన కోదండరాం ముసుగు తొలగిపోయిందన్నారు. తెలం గాణ వచ్చిన తరువాత జేఏసీ అవసరం లేదన్న అభిప్రా యం వ్యక్తమైందని, కోదండరాంను బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనుకున్నామన్నారు. కానీ ఆయనకు రహస్య ఎజెండా ఉందన్నారు. కాంగ్రెస్ పీఆర్వో కోదండరాం: పిడమర్తి కోదండరాం కాంగ్రెస్ పార్టీ పీఆర్వోగా పనిచేస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో ఎప్పుడో భాగమయ్యారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. ఆయన తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. -
నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వట్లేదు
హైకోర్టులో కోదండరాం పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతివ్వా లని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతివ్వట్లేదంటూ టీజేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వట్లేదని, తమ ర్యాలీకి అనుమతి చ్చేలా ఆదేశించాలని కోరుతూ టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్ ఎస్హెచ్ఓలను ప్రతివాదు లుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు. ప్రభుత్వంలో చలనం కోసమే... ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం గా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు టీ జేఏసీ... సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్, నిరా హార దీక్షలు, రాస్తారో కోలు నిర్వహించింది. తాజాగా మేం లేవనెత్తిన అంశం చాలా కీలకమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగం అభివృద్ధి నిరోధకంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత మా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చేందుకు, ఉపాధి అవకాశాల కల్పన కు కార్యచరణ అవసరం. అందులో భాగం గానే ఈ నెల 22న ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించి అనుమతి కోసం చిక్కడపల్లి పోలీసులకు ఈ నెల 1న దరఖాస్తు చేసు కు న్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తకుం డా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. 15న మరోసారి అనుమతి కోరాం. అయినా అనుమతివ్వలేదు. రాజ్యాంగం ప్రకారం సం క్రమించిన హక్కును ఉపయో గించుకునేం దుకే అనుమతి కోరుతున్నాం’ అని కోదండ రాం, వెంకట్‌రెడ్డి కోర్టును కోరారు. -
కోదండరాంపై విమర్శలు సరికాదు
జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ నర్సంపేట : తెలంగాణ ఉద్యవుంలో క్రియూశీల పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రకటనలు చేయుడం సరికాదని డివిజన్ జేఏసీ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో వుంగళవారం విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఒక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో రాదని గ్రహించి అన్ని విధాల సవుర్థుడైన ప్రొఫెసర్ కోదండరాం పేరును అన్ని పార్టీలు సూచించడం జరిగిందన్నా రు. అన్ని పార్టీలను ఏకం చేయుడంలో తనదైన శైలిలో కూడగట్టి వుుందుకు సాగిన వ్యక్తి కోదండరాం అన్నారు. సకలజనుల సమ్మె, సాగరహారం, మిలియున్ వూర్చ్, అసెంబ్లీ వుుట్టడి కార్యక్రవూలను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా చేసిన విషయూన్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వురిచిపోరుు ఇష్టమొచ్చినట్లు వూట్లాడటం హాస్యాస్పదవున్నారు. ఎన్నడు పదవులను ఆశించని, పార్టీలు పెట్టాలనే అలోచన లేని ప్రొఫెసర్‌పై తప్పు డు ఆరోపణలు చేయుడం వూనుకోవాల న్నారు. సవూవేశంలో షేక్ జావిద్, బొనగాని రవీం దర్, లక్ష్మయ్యు, అశోక్ పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు సరికాదు తెలంగాణ ఉద్యవుకారుడు, మేధావి కోదండరాంపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయుడం సరికాదని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు తాటి హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి ఆగబోరుున రవి అన్నా రు. ఈ మేరకు వుంగళవారం వారు విలేకరులతో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలకంగా వ్యవహరించిన మేధావిపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వూట్లాడటం తగదన్నారు.