
కాంగ్రెస్ బాకా కోదండరాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కి బాకాగా మారిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టడమో, లేదా ఏదో ఒక పార్టీ పంచన చేరడంపై స్పష్టమైన సంకేతం ఇచ్చిన కోదండరాం ముసుగు తొలగిపోయిందన్నారు. తెలం గాణ వచ్చిన తరువాత జేఏసీ అవసరం లేదన్న అభిప్రా యం వ్యక్తమైందని, కోదండరాంను బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనుకున్నామన్నారు. కానీ ఆయనకు రహస్య ఎజెండా ఉందన్నారు.
కాంగ్రెస్ పీఆర్వో కోదండరాం: పిడమర్తి
కోదండరాం కాంగ్రెస్ పార్టీ పీఆర్వోగా పనిచేస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో ఎప్పుడో భాగమయ్యారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. ఆయన తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.