
కోదండ రాం
హైదరాబాద్: తెలంగాణ జనసమితి, కాంగ్రెస్‌కి అల్టిమేటం ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి..కానీ సీట్ల కోసం మేం పొత్తులు పెట్టుకోవడం లేదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..‘ ఉమ్మడి కార్యాచరణ, ఆ కార్యాచరణ అమలు , జనసమితికి గౌరవప్రదమైన స్థానంపై మహా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రయోజనాల కోసమే మా
పోరాటం. దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తమే. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. అందరం కలిసి ఒక బలమైన ఎజెండాని ముందుకు తీసుకెళ్లగలమ’ ని వ్యాఖ్యానించారు.
ఇంకా మాట్లాడుతూ..‘ సీట్లకు సంబంధించిన గోప్యత ఉంటుంది. మేం ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదు. మాకు ఒక స్పష్టత ఏర్పడింది. సీట్లు అడిగేటప్పుడు ఎలాంటి ప్రాతిపదికలు చూస్తారో మాకు తెలుసు. ఇన్ని సీట్లు ఇవ్వాలి అని మేం అధికారికంగా చెప్పలేదు. ఒకటి రెండు రోజుల్లో అన్నీ తేలనున్నాయి. కోదండరాం పోటీ చేయాలా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుంద’ని చెప్పారు.
కోదండరాం సమక్షంలో తెలంగాణ జనసమితిలో ప్రముఖ న్యాయవాది ప్రహ్లాద్ చేరారు. గతంలో ప్రహ్లాద్ జేఏసీలో పనిచేశారు. కోదండరాంను విభేదించి బయటకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధినాయకత్వం తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని ఆశ చూయించి కోదండరాంను విమర్శించమని చెప్పిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment