స్టేషన్‌ఘన్‌పూర్: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. బడ్జెట్ రూ.40 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెంచారని, కేవలం కమీషన్ల కోసమే అడ్డగోలుగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీజేఎస్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ప్రజలకు పరిచయం చేసేందుకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే మన సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో ప్రజలు అధికారం అప్పగిస్తే.. పాలన చేతగాక అసమర్థుడైన కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment