
అనంతారంలో మాట్లాడుతున్న దేవయ్య
సాక్షి, పర్వతగిరి: తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వర్ధన్నపేట ప్రజా కూటమి (టీజేఎస్) అభ్యర్థి పగిడిపాటి దేవయ్య అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం, గోపనపల్లి, కొంకపాక, చౌటపల్లి, సోమారం, జమాళ్లపురం, నారాయణపురం, రోళ్లకల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నారు. తాను మూడు వందల కంపెనీలకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టించి వైద్యం అందిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, చౌటపల్లి పీఏసీఏస్ చైర్మెన్ గంధం బాలరాజు, మాజీ సర్పంచ్‌లు బుక్క కుమారస్వామి, యాకయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వంగాల రవీందర్, అబ్జల్, ప్రభాకర్, గంగాధర్‌రావు, ప్రతినిధి జాటోత్ శ్రీనివాస్ నాయక్, విక్రం నాయక్, జ్యేష్ట చందర్, వెంకటయ్య, సులోచన పాల్గొన్నారు. ప్రజా కూటమితో నవ తెలంగాణ.. ప్రజా కూటమితోనే నవ తెలంగాణ సిద్ధి్దస్తుందని టీడీపీ నేత ఈగ మల్లేషం అన్నారు. మండలంలోని తురుకుల సోమారంలో టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, బొంపెల్లి దేవేందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment