pagidipati devaiah
-
గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా..
సాక్షి, పర్వతగిరి: తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వర్ధన్నపేట ప్రజా కూటమి (టీజేఎస్) అభ్యర్థి పగిడిపాటి దేవయ్య అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం, గోపనపల్లి, కొంకపాక, చౌటపల్లి, సోమారం, జమాళ్లపురం, నారాయణపురం, రోళ్లకల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నారు. తాను మూడు వందల కంపెనీలకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టించి వైద్యం అందిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, చౌటపల్లి పీఏసీఏస్ చైర్మెన్ గంధం బాలరాజు, మాజీ సర్పంచ్‌లు బుక్క కుమారస్వామి, యాకయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వంగాల రవీందర్, అబ్జల్, ప్రభాకర్, గంగాధర్‌రావు, ప్రతినిధి జాటోత్ శ్రీనివాస్ నాయక్, విక్రం నాయక్, జ్యేష్ట చందర్, వెంకటయ్య, సులోచన పాల్గొన్నారు. ప్రజా కూటమితో నవ తెలంగాణ.. ప్రజా కూటమితోనే నవ తెలంగాణ సిద్ధి్దస్తుందని టీడీపీ నేత ఈగ మల్లేషం అన్నారు. మండలంలోని తురుకుల సోమారంలో టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, బొంపెల్లి దేవేందర్‌రావు పాల్గొన్నారు. -
'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'
-
'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల ఫలితం వెలువడకముందే బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ...తన ఓటమిని అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తానని అధికారికంగా ప్రకటిస్తే ఉప ఎన్నిక ఫలితం మరోలా ఉండేవని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి పదవిని అధికారికంగా ప్రకటించకపోవడం వల్లే ఈ ఓటమి అంటూ దేవయ్య వాపోయారు. ఇక ఉప ఎన్నికలో టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయం జరిగిందని, అయితే టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఓట్లు అన్ని టీఆర్ఎస్కే పడ్డాయని దేవయ్య వ్యాఖ్యానించారు. -
సొమ్ము కేంద్రానిది..సోకు రాష్ట్రానిది
బీజేపీ శాసన సభాపక్ష ఉపనేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హన్మకొండ: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుంటే, రాష్ట్రం 30 శాతం నిధులు మాత్రమే వెచ్చిస్తూ తామే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నదని బీజేపీ శాసన సభాపక్ష ఉప నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు. సొమ్ము కేంద్రానిదైతే.. సోకు రాష్ట్రానిదవుతుందని అన్నారు. శనివారం హన్మకొండలో బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ఎన్నికల ప్రచార సభలో ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలపై ఓట్లకు వస్తున్న రాష్ట్ర మంత్రులను ప్రజలు నిలదీయాలన్నారు. మోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. ఈ క్రమంలో పేదల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపలేని మంత్రులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. -
‘కమలం’ అభ్యర్థిగా దేవయ్య
బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయం... సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఎట్టకేలకు బీజేపీ తన అభ్యర్థిని తేల్చింది. డాక్టర్ పగిడిపాటి దేవయ్య పేరును ఖరారు చేస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో దేవయ్య పేరును పార్టీ అభ్యర్థిగా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీకి నివేదించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నిక కమిటీ పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశమైంది. దేవయ్య అభ్యర్థిత్వంపై మిత్రపక్షమైన టీడీపీతో అంతకుముందుగానే చర్చించారు. దేవయ్యతోపాటు చింతా స్వామి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రాజమౌళి తదితరుల పేర్లపై పార్టీ ఎన్నికల కమిటీ చర్చించింది. వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసింది. బయోడేటా పేరు: పగిడిపాటి దేవయ్య వృత్తి: వైద్య నిపుణుడు (హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య పట్టా) తల్లిదండ్రులు: కోటమ్మ, రత్నం (11 మంది తోబుట్టువుల్లో చిన్నవాడు) స్వగ్రామం: ఖిలాషాపూర్ (వరంగల్ జిల్లా) నివాసం: ఫ్లోరిడా (అమెరికా) భార్య: రుద్రమదేవి (డాక్టర్) పిల్లలు: ఇద్దరు కుమారులు (సిద్ధార్థ, రాహుల్‌దేవ్), ఒక కుమార్తె (సృజన)