'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది' | bjp condidate devaiah comments on warangal by-election results | Sakshi
Sakshi News home page

'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'

Published Tue, Nov 24 2015 10:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది' - Sakshi

'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల ఫలితం వెలువడకముందే బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ...తన ఓటమిని అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తానని అధికారికంగా ప్రకటిస్తే ఉప ఎన్నిక ఫలితం మరోలా ఉండేవని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి పదవిని అధికారికంగా ప్రకటించకపోవడం వల్లే ఈ ఓటమి అంటూ దేవయ్య వాపోయారు. ఇక ఉప ఎన్నికలో టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయం జరిగిందని, అయితే  టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఓట్లు అన్ని టీఆర్ఎస్‌కే పడ్డాయని దేవయ్య వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement