warangal by-election results
-
కేసీఆర్ వ్యూహం ఫలించిందా...!
వరంగల్ : వరంగల్ వార్ వన్‌సైడ్ కావడానికి కారణమేంటి? అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో మెజారిటీ ఏమాత్రం తగ్గినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు తప్పవు. అలాంటి విమర్శలు మొదలైతే ఆ ప్రభావం త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా పడుతుంది. రాజకీయంగా ఈ విషయాలు తెలిసిన కేసీఆర్ వరంగల్ ఉపఎన్నిక తొలినుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు స్పష్టమవుతుంది. ఏ చిన్న విషయంలోనూ నిర్లక్ష్యం చూపరాదంటూ నేతలను ఎప్పటికప్పుడు పురమాయించడం భారీ మెజారిటీకి కారణమైందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించే అవకాశాలుంటాయని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ప్రతిరోజూ కేసీఆర్ నేతలతో మాట్లాడుతూ పురమాయించారు. నిజానికి ఈ ఉపఎన్నిక విషయంలో ప్రచారం చేయకూడదని తొలుత భావించినప్పటికీ విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్న భావనతోనే కేసీఆర్ స్వయంగా ప్రచార సభల్లో కూడా పాల్గొన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రోజూవారి పర్యవేక్షణతో పాటు పోలింగ్ రోజున కూడా మండలాల వారిగా ఇంచార్జీలతో మాట్లాడుతూ అవసరమైన సూచనలిచ్చారు. ఆ కారణంగా గత రికార్డును బద్దలు చేస్తూ నాలుగున్న లక్షలకుపైగా భారీ మెజారిటీ సాధ్యమైందని టీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించింది. ఉప ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈసారి ఫలితాల్లో గతంకన్నా మెజారిటీ ఏమాత్రం తగ్గినా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శల దాడి తప్పదు. వాటిని తిప్పికొట్టాలన్న వ్యూహంతో ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంచార్జీ చొప్పున మంత్రులు, ఎంపీలను నియమించారు. వారితో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. నియోజకవర్గాల వారిగా నివేదికలు తెప్పించుకుని రోజువారిగా నేతల పురమాయించారు. పోలింగ్ కేంద్రాల వారిగా నివేదికలు తెప్పించుకుంటూ మార్గనిర్ధేశం చేశారు. గత ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఈసారి పాలకుర్తిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ లభించింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోవడంతో టీఆర్ఎస్కు మరింత బలాన్నిచ్చింది. -
ఐదు నియోజకవర్గాల్లో లెక్కింపు పూర్తి
వరంగల్ : అయిదు నియోజకవర్గాల్లో వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. పాలకుర్తి, పరకాల, వరంగల్ ఈస్ట్, వెస్ట్‌తో పాటు వర్థన్నపేటలో కౌంటింగ్ ముగిసింది. అలాగే స్టేషన్ ఘనపూర్, భూపాలపల్లిలో చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మరోవైపు మిగతా నియోజవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,38, 824 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో దూసుకు వెళుతున్నారు. టీఆర్ఎస్-5,87,591, కాంగ్రెస్-1,48,767, బీజేపీ-1,24,425, వైఎస్ఆర్ సీపీ-19,728 ఓట్లు లభించాయి. -
కడియం రికార్డు బద్దలయింది
వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గత రికార్డు బద్దలయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఓట్లతో మెజార్టీ దిశగా దూసుకు వెళుతున్నారు. గతంలో ఇక్కడ రికార్డు ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరిట ఉండేది. దయాకర్ సాధించిన ఈ రికార్డు గతంలో 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సాధించిన మెజార్టీ కన్నా కూడా అధికమే. ప్రస్తుతానికి టీఆర్ఎస్-5,39,096, కాంగ్రెస్-1,53,896, బీజేపీ - 1,28,452, వైఎస్ఆర్ సీపీకి-20,666 ఓట్లు లభించాయి. 2014లో ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. కాగా, నేటి ఉప ఎన్నికల ఫలితాల్లోని ప్రతి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే మెజారిటీ 5 లక్షలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. -
తెలంగాణ భవన్లో మిన్నంటిన సంబరాలు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుండటంతో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు మిన్నంటే సంబరాలు జరుపుకుంటున్నాయి. టీఆర్ఎస్ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్లోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు రంగులు చల్లుకుని, మిఠాయిలు పంచుకుంటున్నారు. డప్పువాయిద్యాలతో నృత్యాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు రానున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. కాగా మంత్రి కేటీఆర్ కూడా వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం మరింత ఉత్సహంతో పని చేసేందుకు వరంగల్ ప్రజలు స్ఫూర్తినిచ్చారని ఆయన ట్విట్ చేశారు. ఈ విజయంతో తమ బాధ్యతను మరింత పెంచిందని కేటీఆర్ అన్నారు. జాతీయ పార్టీలకు డిపాజిల్లు దక్కకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కార్యక్రమాన్ని మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. -
అధికారికంగా 11 రౌండ్ల ఫలితాలు వెల్లడి
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికలో 'కారు' జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 11 రౌండ్ల ఓట్ల లెక్కింపును అధికారులు వెల్లడించారు. ఇక ఆది నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ సుమారు రెండున్నర లక్షలకు పైగా ఆధిక్యంలో అంచనాలకు మించి దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ కౌంటింగ్ పూర్తయిన ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ 62 శాతం , కాంగ్రెస్ 16 శాతం, బీజేపీ 11 శాతం ఓట్లు కైవసం చేసుకున్నాయి. కాగా 11 రౌండ్ల ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. టీఆర్ఎస్ 2,76,497, ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక టీఆర్ఎస్- 3,73,279, కాంగ్రెస్- 96,782, బీజేపీ- 75,387, వైఎస్ఆర్ సీపీ- 13490,నోటా-4,801 ఓట్లు వచ్చాయి. కాగా వరంగల్ ఉపఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఫలితాల్లో టీఆర్ఎస్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. అధికార టీఆర్ఎస్ ఏరికోరి తెలంగాణవాది పసునూరి దయాకర్‌ను నిలబెట్టింది. అనుహ్య పరిణామాల మధ్య సిరిసిల్ల రాజయ్య స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బరిలోకి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, బీజేపీ నుంచి పగిడిపాటి దేవయ్య పోటీ చేశారు. -
వరంగల్ వార్
-
వరంగల్ వార్ వన్ సైడే...
-
వరంగల్ వార్ వన్ సైడే...
వరంగల్ : ఓరుగల్లు ఉప ఎన్నిక పోరులో కారు దూసుకెళుతోంది. ఊహించని విధంగా కారు టాప్ గేర్‌లో వెళ్తోంది. దీంతో వార్ వన్ సైడే అయ్యింది. ఓట్ల లెక్కింపులో తొలి నుంచీ టిఆర్ఎస్ ఆధిక్యంలోనే వుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో, పాత మెజార్టీని అధిగమించే దిశగా కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ మూడు లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ రెండో స్థానంలో, బిజెపి మూడో స్థానంలో వున్నాయి. ప్రతి సెగ్మెంట్లోనూ...ప్రతి రౌండ్లోనూ టిఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ కనపడుతోంది. గట్టి పోటీనిస్తామని చివరి వరకు చెప్పుకొచ్చిన కాంగ్రెస్ భారీ తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంటోంది. కాగా నాలుగు రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. -
'కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే ఈవిజయం'
-
'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల ఫలితం వెలువడకముందే బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ...తన ఓటమిని అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తానని అధికారికంగా ప్రకటిస్తే ఉప ఎన్నిక ఫలితం మరోలా ఉండేవని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి పదవిని అధికారికంగా ప్రకటించకపోవడం వల్లే ఈ ఓటమి అంటూ దేవయ్య వాపోయారు. ఇక ఉప ఎన్నికలో టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయం జరిగిందని, అయితే టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఓట్లు అన్ని టీఆర్ఎస్కే పడ్డాయని దేవయ్య వ్యాఖ్యానించారు. -
తొలి నుంచీ ఆధిక్యం....
-
దూసుకెళుతున్న 'కారు'
-
తొలి నుంచీ ఆధిక్యం....
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ ....తొలి రౌండ్ నుంచి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. అయిదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంటే... కాంగ్రెస్ 30వేలు, బీజేపీ 29 వేలు ఓట్లు దక్కించుకున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. విపక్షాల ఓట్ల కంటే రెట్టింపు సంఖ్యలో టీఆర్ఎస్ కు ఓట్లు వచ్చాయి. మరోవైపు నోటాకు 1122 ఓట్లు నమోదు అయ్యాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి... టీఆర్ఎస్-పసునూరి దయాకర్- 122157 కాంగ్రెస్-సర్వే సత్యనారాయణ-15853 బీజేపీ- దేవయ్య-12739 వైఎస్ఆర్ సీపీ- నల్లా సూర్యప్రకాశ్-2155 -
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
-
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా తొలిరౌండ్ పూర్తయ్యేసరికి.... టీఆర్ఎస్ 34వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. పాలకుర్తి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. పాలకుర్తిలో 1600, పరకాలలో 900 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకు వెళుతోంది. వరంగల్ వెస్ట్ : టీఆర్ఎస్-4,653, కాంగ్రెస్-976, బీజేపీ-496 వరంగల్ ఈస్ట్ : టీఆర్ఎస్- 5,182, కాంగ్రెస్-840, బీజేపీ-826 వర్ధన్న పేట : టీఆర్ఎస్-4,656, కాంగ్రెస్-1691, బీజేపీ-552 పాలకుర్తి : టీఆర్ఎస్-౩,401, కాంగ్రెస్-1,408, బీజేపీ- 2,496 పరకాల : టీఆర్ఎస్-6,758, కాంగ్రెస్-940, బీజేపీ-405 కాగా వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల మార్కెట్ యార్డులో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్లు లెక్కించడానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేయగా మొత్తం 20రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. నియోజకవర్గంలో దాదాపు 15లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుత ఉప ఎన్నికలో 69.01శాతం ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓటర్లున్న వరంగల్ పశ్చిమ స్థానంలోనే 1.2లక్షలు.. అత్యల్పంగా 48.03శాతం పోలింగ్ నమోదైంది. మిగతా సెగ్మెంట్ల విషయానికొస్తే స్టేషన్ ఘన్పూర్ 74.55, పరకాల 76.69శాతం, పాలకుర్తి 76.51శాతం, వర్ధన్నపేట 74.03శాతం, భూపాలపల్లి 70.1శాతం, వరంగల్ తూర్పు 62.21శాతం పోలింగ్ నమోదైంది. -
వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటలలోపే వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న సిబ్బంది.. మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. 8 గంటలకు ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్ ఫలితం 9:30కు వెలువడే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఏనుమాముల మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 80 మంది చొప్పున సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 600 మంది సిబ్బందిని నియమించినట్లు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ తెలిపారు. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో 15,09,671 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికలో 10,35,656 మంది(69.19 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. 23 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, వామపక్ష కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. లోక్‌సభ సెగ్మెంట్లో మొత్తం 1,178 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 297 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 19 రౌండ్లు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో 18 రౌండ్లలో ఫలితాలు వెలువ డుతాయి. ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఫలితాల సరళి ఆధారంగా రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయి.