వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా తొలిరౌండ్ పూర్తయ్యేసరికి.... టీఆర్ఎస్ 34వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. పాలకుర్తి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. పాలకుర్తిలో 1600, పరకాలలో 900 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకు వెళుతోంది.
వరంగల్ వెస్ట్ : టీఆర్ఎస్-4,653, కాంగ్రెస్-976, బీజేపీ-496
వరంగల్ ఈస్ట్ : టీఆర్ఎస్- 5,182, కాంగ్రెస్-840, బీజేపీ-826
వర్ధన్న పేట : టీఆర్ఎస్-4,656, కాంగ్రెస్-1691, బీజేపీ-552
పాలకుర్తి : టీఆర్ఎస్-౩,401, కాంగ్రెస్-1,408, బీజేపీ- 2,496
పరకాల : టీఆర్ఎస్-6,758, కాంగ్రెస్-940, బీజేపీ-405
కాగా వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల మార్కెట్ యార్డులో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్లు లెక్కించడానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేయగా మొత్తం 20రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. నియోజకవర్గంలో దాదాపు 15లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుత ఉప ఎన్నికలో 69.01శాతం ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓటర్లున్న వరంగల్ పశ్చిమ స్థానంలోనే 1.2లక్షలు.. అత్యల్పంగా 48.03శాతం పోలింగ్ నమోదైంది. మిగతా సెగ్మెంట్ల విషయానికొస్తే స్టేషన్ ఘన్‌పూర్ 74.55, పరకాల 76.69శాతం, పాలకుర్తి 76.51శాతం, వర్ధన్నపేట 74.03శాతం, భూపాలపల్లి 70.1శాతం, వరంగల్ తూర్పు 62.21శాతం పోలింగ్ నమోదైంది.
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
Published Tue, Nov 24 2015 8:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement