అయిదు నియోజకవర్గాల్లో వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది.
వరంగల్ : అయిదు నియోజకవర్గాల్లో వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. పాలకుర్తి, పరకాల, వరంగల్ ఈస్ట్, వెస్ట్తో పాటు వర్థన్నపేటలో కౌంటింగ్ ముగిసింది. అలాగే స్టేషన్ ఘనపూర్, భూపాలపల్లిలో చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
మరోవైపు మిగతా నియోజవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,38, 824 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో దూసుకు వెళుతున్నారు. టీఆర్ఎస్-5,87,591, కాంగ్రెస్-1,48,767, బీజేపీ-1,24,425, వైఎస్ఆర్ సీపీ-19,728 ఓట్లు లభించాయి.