తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు | bipoll celebrations in trs bhavan | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు

Published Tue, Nov 24 2015 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు

తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు

హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుండటంతో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు మిన్నంటే సంబరాలు జరుపుకుంటున్నాయి.  టీఆర్ఎస్ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్‌లోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు రంగులు చల్లుకుని, మిఠాయిలు పంచుకుంటున్నారు. డప్పువాయిద్యాలతో నృత్యాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్కు రానున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.  

కాగా మంత్రి కేటీఆర్ కూడా వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం మరింత ఉత్సహంతో పని చేసేందుకు వరంగల్ ప్రజలు స్ఫూర్తినిచ్చారని ఆయన ట్విట్ చేశారు. ఈ విజయంతో తమ బాధ్యతను మరింత పెంచిందని కేటీఆర్ అన్నారు. జాతీయ పార్టీలకు డిపాజిల్లు దక్కకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కార్యక్రమాన్ని మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement