సాక్షి, హైదరాబాద్ : ఒక పార్టీ క్యాండిడేట్ మరో పార్టీ గుర్తుపై పోటీ చేయటం కదరదని, అది సాధ్యమయ్యే విషయం కాదన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షడు ప్రొ కోదండరాం. శుక్రవారం సీట్ల సర్దుబాటుపై టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, కోదండరాంలు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఎలాంటి నిర్ణయం లేకుండానే ఈ చర్చలు ముగిశాయి. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఓ నిర్ణయం తీసుకున్నాక అందరికీ చెబుతామని అన్నారు.
తెలంగాణ జన సమితీ అభ్యర్థులు ఆ పార్టీ తరపునే పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తై నెంబర్ కూడా వచ్చిందని, రేపో మాపో గుర్తుకూడా వస్తుందని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు సొంత గుర్తుపైనే పోటీ చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై తాను మాట్లాడదలుచుకోలేదని, అందులో అంత గొప్ప విషయం కూడా ఏం లేదని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment