
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ దుష్ట పాలనను అంతం చేయడానికే కూటమి ఏర్పా టైందని టీజేఎస్ అధ్యక్షుడు ఎం.కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాసంలో కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులు, కాంగ్రెస్ పార్టీ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కోదండరాం మాట్లాడుతూ.. పొత్తు చర్చలపై మీడియాలో గందరగోళంగా ఉందని, ఈ అంశంపై తాము కూడా చర్చించినట్టు తెలిపారు.