టీజేఎస్‌కు తిరుణహరి శేషు రాజీనామా | Tirunahari Seshu Resigned to TJS party Warangal | Sakshi
Sakshi News home page

టీజేఎస్‌కు తిరుణహరి శేషు రాజీనామా

Published Mon, Nov 12 2018 11:22 AM | Last Updated on Sat, Nov 17 2018 9:48 AM

Tirunahari Seshu Resigned to TJS party Warangal - Sakshi

సాక్షి, కాజీపేట అర్బన్‌: తెలంగాణ జన సమితిలో రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌గా సేవలందించిన డాక్టర్‌ తిరుణహరి శేషు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హన్మకొండ అలంకార్‌ జంక్షన్‌లోని టీజేఎస్‌ కార్యాలయంలో ఆదివారం శేషు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌లో టీజేఎస్‌ బలోపేతానికి యువత, విద్యార్థులు, విద్యావంతులను ఏకం చేసిన తనకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రాధాన్యత ఇవ్వక అవమానించాడని పేర్కొన్నారు.

అందుకే మనస్థాపం చెందిన తాను పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేస్తూ సంబంధించిన లేఖను ఈనెల 5న కోదండరామ్‌కు పంపించినా నేటి వరకు స్పందించలేదన్నారు. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కల్లూరి పవన్,రమాకాంత్, అడ్డూరి గౌతమ్, బయ్యా వేణు, దడబోయిన శ్రీనివాస్, బొజ్జ సందీప్, కిరణ్, ప్రశాంత్, ఇమ్రాన్, గణేష్, అజయ్, దామెదర్, అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement