సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వీలై నన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జనసమితి (టీజేఎస్) కసరత్తు ప్రారంభించింది. పోటీ చేయాల్సిన స్థానాలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలంగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి, మండలాల వారీగా పార్టీ శ్రేణుల బలాబలాలను బట్టి పోటీకి సిద్ధం చేయాలని భావిస్తోంది. జిల్లాల సన్నాహకాల సమావేశాలకు శ్రీకారం చుట్టింది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం జరిగిన పరిషత్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కోదండరాం పలు అంశాల పై చర్చించారు. పార్టీ తరఫున ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా విశ్వేశ్వర్‌రావు వ్యవహరించనుండగా, ఆ పార్టీ నేతలు రమేష్‌రెడ్డి, పాండురంగారావు, గోపాల్‌శర్మ, జగ్గారెడ్డి, అంబటి శ్రీనివాస్, శ్రీశైల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెదిరె యోగేశ్వర్‌రెడ్డి, అవినాశ్ మాలవ్యలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment